సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం, మండలం దౌల్తాబాద్ గ్రామ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ సంగీతకు వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షులు, పాలకవర్గం తమను ఇష్టానుసారంగా నడుపుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
మండలం దౌల్తాబాద్ గ్రామ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, వారి పాలకవర్గం సంఘాన్ని ఇష్టానుసారంగా నడుపుతున్నారని, వారిపై చర్య తీసుకుని సంఘ సభ్యులందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ సంగీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత పారిశ్రామిక సహకార సంఘంలో 84 మంది సభ్యులకు వాటాదనం ఇవ్వకుండా, అధ్యక్షులు, వారి పాలకవర్గం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్య తీసుకొని నిరుపేద గీత కార్మిక కుటుంబాలకు కూడా వాటాదనం ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు చంద్రం దుర్గాగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు పటేల్ యాదాగౌడ్, దౌల్తాబాద్ నిరుపేద గీత కార్మికులు పటేల్ నరసింహ గౌడ్, నారాయణ గౌడ్, మల్కాపురం వెంకటేశం గౌడ్, పద్మ, రాజుగౌడ్, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


