మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ ఇస్లాంపుర, గౌతమి నగర్లలో కోతుల బెడద తీవ్రమైంది. గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మేయర్‌కు అబ్దుల్ సత్తార్ వినతిపత్రం అందజేశారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ ఇస్లాంపుర, గౌతమి నగర్లలోని రామాలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తూ ఆలయానికి వచ్చే వారిపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన కోతుల బెడదను తక్షణమే అరికట్టాలని కోరుతూ మున్సిపల్ మేయర్‌కు అబ్దుల్ సత్తార్ వినతిపత్రం అందజేశారు.
సంబంధిత అధికారుల సహాయంతో వెంటనే కోతులను పట్టి, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తక్షణమే స్పందించి కోతులను పట్టి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.








