మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో దీపావళి వేడి రాజుకుంది. నేతల విమర్శలు, పార్టీల చేరికలు, రాజకీయ ప్రకటనలతో వాతావరణం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే పీఎస్ఆర్ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుండగా, ఇతర పార్టీల నేతలు ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మంచిర్యాల రాజకీయాల్లో దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో బాంబుల మోత నేతల విమర్శలు, పార్టీల చేరికలు, రాజకీయ ప్రకటనలతో వేడి రాజుకుంటోంది. ఎమ్మెల్యే పీఎస్ఆర్ అభివృద్ధి పనులు, ప్రభుత్వ నిధుల వినియోగంపై దృష్టి సారిస్తూ దూకుడుగా కింగ్ కాంగ్ బాంబ్ శబ్దాన్ని చేస్తున్నట్లు కనిపిస్తుంది.
కాంగ్రెస్ నేత జగన్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ వర్గాలకు మద్దతుగా కాంగ్రెస్ బలోపేతం చేస్తూ డబుల్ సౌండ్ టపాస్ లా మంత్రి వివేక్ ఎంపీ వంశీ వర్గాన్ని బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు విజిత్ రావు, బీఆర్ఎస్లో చేరికలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు తో లక్ష్మీ బాంబుల పేలుతున్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ థౌసండ్వాలా పేలుస్తుండగా, కల్వకుంట్ల కవిత మంచిర్యాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పాటు పీఎస్ఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తారాజువ్వల వెలుగుతున్నారు. మరోవైపు, మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు బీఆర్ఎస్ బలోపేతం, నేతల చేరికలపై దృష్టి పెడుతూ హైటెక్ హైడ్రోజన్ బాంబుల శబ్దం చేస్తున్నారు.
మొత్తంగా, మంచిర్యాల రాజకీయాల్లో దీపావళి టపాసుల మోత మొదలైంది. విమర్శలు, చేరికలు, రాజకీయ ప్రకటనలతో వేడెక్కిన ఈ రాజకీయం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.







