హైదరాబాద్, 12 November
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, రచయిత డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ (40) ఆకస్మిక మరణం పట్ల మనతెలంగాణ ముదిరాజ్ సభ రాష్ట్ర కమిటీ తోపాటు సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, రచయిత డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ (40) ఆకస్మిక మరణం పట్ల మనతెలంగాణ ముదిరాజ్ సభ రాష్ట్ర కమిటీ తోపాటు సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున స్వగ్రామంలో తుదిశ్వాస విడవడం అత్యంత బాధాకరమని కమిటీ పేర్కొంది.
సామాజిక శాస్త్రవేత్తగా, రచయితగా సమాజానికి తన మేధోసేవలు అందించిన ఆయన మరణం ముదిరాజ్ సమాజానికే కాకుండా సామాజిక, సాహిత్య రంగాలకు తీరని లోటని సంతాప ప్రకటనలో కమిటీ తెలిపింది.
ఆయన అందించిన రచనలు, ఆలోచనలు, సామాజిక సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కమిటీ పేర్కొంది.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనతెలంగాణ ముదిరాజ్ సభ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించింది.







