హైదరాబాద్, 12 November
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రివివేక్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్లతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ర్యాలీని వివేక్జయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఫహీం ఖురేషితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రకటించారు.
హైదరాబాద్లో గిగ్ వర్కర్లతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ర్యాలీని నగరవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గత పదేళ్లుగా పెరగని ఆటో ఛార్జీలను పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా పెంచామని, ఆటో డ్రైవర్ల చిరకాల డిమాండ్ అయిన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు అంగీకరించి, చట్టబద్ధమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు.
క్యాబ్, ట్యాక్సీ, ర్యాపిడో తదితర అగ్రిగేటర్ రంగాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికి కూడా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.
మహిళా సంఘాల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలను పోషించుకునేలా ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, రెండున్నర లక్షల మంది లబ్ధిదారులు కొత్త ఇళ్లలో దీపావళి జరుపుకున్నారని తెలిపారు. హైదరాబాద్లో పేదలు, నిరుద్యోగుల కోసం లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని, ఎకరా రూ.100 కోట్ల విలువైన ఖరీదైన ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.


