సంగారెడ్డి, 14 November
నవంబరు 18వ తేదీన దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ జరగనుంది.
నవంబరు 18వ తేదీన దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. లో శనివారం దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క దళిత జర్నలిస్టు ఈ మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జరిగే మహాసభలో ప్రతి దళిత జర్నలిస్టు పాల్గొని దళితుల ఐక్యతను చాటాలని ఆయన కోరారు. విలేకరులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రథమంగా దళిత జర్నలిస్టులకే అందాలంటే మన ఐక్యతను నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామని అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు దానం మోహన్ తదితరులు పాల్గొన్నారు.







