మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 17
ముదిరాజుల హక్కుల పరిరక్షణ, రాజకీయ వాటా సాధన, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఐక్యతే ముదిరాజులకు శ్రీరామరక్ష అని, హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు రావాలని సంఘం రాష్ట్ర కార్యదర్శులు గరిగంటి కొమురయ్య, దబ్బెట తిరుపతి పిలుపునిచ్చారు.
ముదిరాజుల హక్కుల పరిరక్షణ, రాజకీయ వాటా సాధన, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శులు గరిగంటి కొమురయ్య, దబ్బెట తిరుపతి స్పష్టం చేశారు. ఐక్యతే ముదిరాజులకు శ్రీరామరక్ష అని, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈనెల 21న నిర్వహించనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు బండ ప్రకాష్ నాయకత్వంలో ముదిరాజుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగుతోందన్నారు.
రాష్ట్రంలో సుమారు 14 శాతం జనాభా కలిగిన ముదిరాజులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. కామారెడ్డి ఎన్నికల ఎజెండాలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటు ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మూడేళ్లు గడిచాయని, ఇకనైనా స్పందించకపోతే...
ఉద్యమ కార్యాచరణ
రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు గరిగంటి కొమురయ్య, దబ్బెట తిరుపతి తెలిపారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా యువత అధ్యక్షులు గరికే సుమన్ తూటి రమేష్, నూనె రాజేశం, నంబాల పోషన్న, బొమ్మల వేణి సాయి, మంద రమేష్, రాకే వార్ రాజు తదితరులు పాల్గొన్నారు.







