గర్మిళ్లు, నస్పూర్ 3వ డివిజన్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) నవంబర్ 17
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ విషాద సంఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూస్కూర్ రామ్మోహన్ రావు పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని ఉషోదయ విద్యాసంస్థల కరస్పాండెంట్ యార్లగడ్డ బాలాజీ మాతృవియోగం, గర్మిళ్లకు చెందిన ఎస్కే ఆదిల్ భార్య మృతి, నస్పూర్ 3వ డివిజన్‌కు చెందిన వేల్పుల సిద్ధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాలను ఆయన పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు పూస్కూర్ రామ్మోహన్ రావు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యెడ్ల శంకర్, ఎండీ తాజుద్దీన్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.







