పటాన్చెరు, 8 November
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం అన్నారు. ఆదివారం మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపూరి శివానందం కేక్ కట్ చేసి, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఇందిరమ్మ కాలనీ ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళల ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రమ్ గౌడ్, ఉప సర్పంచ్ గోరేమియా, మాజీ ఎంపీపీ జంగయ్య, సభ్యులు సురేందర్, వార్డు కుమార్ గౌడ్, గ్రామ పెద్దలు కుమ్మరి నాగేష్, కుమ్మరి నర్సింలు, కుమ్మరి శ్రీహరి, రవీందర్, అంతయ్య, బ్యాగరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.







