చెన్నూరు, 15 July
చెన్నూరు నియోజకవర్గంలోని భీమారంలో నిర్మించిన నూతన గ్రౌండ్, యువతకు ఉద్యోగ, క్రీడా అవకాశాలను కల్పిస్తూనే, ఉదయం వేళల్లో ఆరోగ్యానికి దోహదపడుతోంది. అయితే, రాత్రి వేళల్లో దీని దుర్వినియోగం ఆందోళన కలిగిస్తోంది.
చెన్నూరు నియోజకవర్గంలోని భీమారంలో నూతనంగా కొన్ని లక్షలు వెచ్చించి నిర్మించిన గ్రౌండ్, ఎందరో యువతకు ఉద్యోగాలు కల్పించుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఈ గ్రౌండ్లోనే యువత జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహించారు. ఈ మైదానం ఉదయం పూట యువతతో పాటు వృద్ధులకు మార్నింగ్ వాక్ చేయడానికి ఎంతో అనువుగా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గ్రౌండ్ ఉండటంతో పాటు, సమీపంలోనే రైతు వేదిక, ప్రభుత్వ ఆస్పత్రి కూడా అందుబాటులో ఉన్నాయి.
అయితే, రాత్రి సమయాల్లో ఈ గ్రౌండ్ తాగుబోతులకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.











