భీమారం, 2026-06-05
మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా భీమారం ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భీమారం పట్టణ సమీపంలోని 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, కిరాణా దుకాణాలు, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు
నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి నార్కోటిక్ డాగ్ సహాయంతో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ, మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
యువతకు సూచనలు
ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించి ఎక్కడైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరారు.
సమాచారం గోప్యంగా ఉంచుతాం
ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని భీమారం పోలీసులు విజ్ఞప్తి చేశారు.