సంగారెడ్డి, 13 September
జాతీయ మెగా లోక్అదాలత్ను పురస్కరించుకుని జిల్లాలో రాజీకి అవకాశం ఉన్న 819 ఐపీసీ కేసులను పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సైబర్ నేరాల బాధితులకు రూ.43.50 లక్షలు తిరిగి ఇప్పించేందుకు కోర్టు అనుమతి పొందినట్లు ఆయన వెల్లడించారు.
జాతీయ మెగా లోక్అదాలత్ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో నమోదై, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాజీకి అవకాశం ఉన్న 819 ఐపీసీ కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే 1,135 ఈ-పెట్టి కేసులు, 1,839 డీడీ కేసుల్లో అడ్మిషన్/జరిమానా విధింపు ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి జిల్లాలో నమోదైన 58 కేసుల్లో రూ.43.50 లక్షలు, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఉన్న మరో 73 కేసుల్లో రూ.7.80 లక్షలు సైబర్ బాధితులకు తిరిగి ఇప్పించేందుకు కోర్టు నుంచి అనుమతి పొందినట్లు ఎస్పీ వెల్లడించారు. క్షణికావేశంలో జరిగే తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్అదాలత్ మంచి అవకాశమని అన్నారు. అనవసరమైన గొడవలకు వెళ్లి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దని సూచించారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’ అని పేర్కొంటూ, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరువర్గాలు సఖ్యతతో సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమమని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో జిల్లా పోలీసులు కనబరిచిన అంకితభావం, సమన్వయం, సేవా దృక్పథాన్ని ఎస్పీ అభినందించారు. ఇలాంటి అత్యుత్తమ పనితీరు జిల్లా పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ మెగా లోక్అదాలత్ను విజయవంతం చేయడంలో కృషి చేసిన వర్టికల్ డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, డీ4సీ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, లైజనింగ్ అధికారి ఎస్ఐ సత్యనారాయణ, కోర్టు డ్యూటీ అధికారులు, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.












