హైదరాబాద్, 16 July
దేశవ్యవసయర్వఅపద్దరమై్రడయ్బోయేజీయఅధ్య్షుర్మర,్షదమదజీవపధ్పస్ద్రడయ్యుుపరు.్రడయ్మజీఉపధ్య్షుువ.మధుసూదన్ రెడ్డి సన్మానం నిర్మాణ రంగంపై క్రెడాయ్ నేతల చర్చ: హైదరాబాద్ మోడల్ సిటీగా ఎదుగుతుందని అంచనా జాతీయ ప్రెసిడెంట్ కుసూద్రడ్డ,్రడయ్జీయప్రసడట్ుప్రసడట్ఎ్ట్శ్రీుమ్మరరడ్డికిమ్రడ్డసశుభ్షుపరు.ఈసదర్భర్మరపైచర్చచరు.
భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగంగా విస్తరించిన నిర్మాణ రంగం, లక్షలాది మందికి జీవనోపాధిని, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోందని క్రెడాయ్ ( Confederation of a Real Estate & Developers Association of India) నాయకులు అభిప్రాయపడ్డారు. ఇది ఒక జాతీయ నిర్మాణ రంగ సంస్థ.
క్రెడాయ్ తెలంగాణ మాజీ ఉపాధ్యక్షులు వి. మధుసూదన్ రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షులుగా 2027 ఏప్రిల్ లో పదవి స్వీకరించబోతున్న ప్రస్తుత క్రెడాయ్ జాతీయ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ గుమ్మి రామ్ రెడ్డిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర నిర్మాణ రంగ స్థితిగతులపై వారు చర్చించారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగం ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోయినా, రాబోయే రెండేళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారధ్యంలో గణనీయమైన మార్పులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి కలల స్వప్నమైన ఫ్యూచర్ సిటీ (Future City) నిర్మాణ పనులు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్ సిటీ ద్వారా కొనసాగేలా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనితో దక్షిణాదిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక మోడల్ సిటీగా రూపుదిద్దుకోబోతుందని సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వృద్ధి చెందే అవకాశాలున్నాయని వారు తెలియపరిచారు.











