కార్యక్రమంలో (అక్షరవేకువ) సెప్టెంబర్ 05
దండేపల్లి మండల కేంద్రంలో శనివారం పర్యావరణ పరిరక్షణ సమితి నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు గొల్ల రాజమల్లు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. కుక్కలు, కోతుల సమస్యలతో పాటు ప్లాస్టిక్, నీటి కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలను అరికట్టేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణకు నూతన కమిటీ కుక్కలు, కోతుల సమస్యలతో పాటు ప్లాస్టిక్, నీటి కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ దండేపల్లి: మండల కేంద్రంలో శనివారం పర్యావరణ పరిరక్షణ సమితి నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు గొల్ల రాజమల్లు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కలు, కోతుల సమస్యల నివారణతో పాటు ప్లాస్టిక్ వినియోగం, నీటి కాలుష్యం తదితర పర్యావరణ సమస్యలను అరికట్టేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు: గౌరవ అధ్యక్షులుగా బొలిశెట్టి లింగారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులుగా చెన్నవేణి భాను ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గరిగే మురళి, కోశాధికారిగా కుడికాల రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా సంతోష్, ఆడేపు నాగేష్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా గుడికందుల భాస్కర్, గుర్రం విశాల్, ప్రధాన సలహాదారులుగా అల్లంల కుమారస్వామి యాదవ్, బొమ్మెన మహేష్, గొట్ల భూమన్న యాదవ్, బొలిశెట్టి రాజులను ఎన్నుకున్నారు. ఈ మండల అధ్యక్షులు తాళ్ల కుమారస్వామిగౌడ్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.












