మహబూబ్నగర్ కు బదిలీ అయిన అటవీ జిల్లా అధికారి శ్రీ శివ్ ఆశీష్ సింగ్ కు వీడ్కోలు పలుకుతూ, కొత్త అధికారికి స్వాగతం తెలిపేందుకు అటవీ అధికారులు శ్రీరాంపూర్ సింగరేణి గెస్ట్ హౌస్ నందు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ శాంతారాం FDPT గారు మాట్లాడుతూ, ఉద్యోగులు ఇష్టపడి పనిచేస్తే మంచి పేరుతో పాటు సంతృప్తి లభిస్తుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో అటవీ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
బదిలీపై వెళ్తున్న జిల్లా అధికారి తన కాలంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే అధికారికి స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











