మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 19
చగడబొడడఉపఠశేచఎఅడొపచేపచజగ.ఆఆఉఈషణపేచేడచే,పగఅేప.
మంచిర్యాల నగర నడిబొడ్డున ఉన్న హైటెక్ సిటీలో పాఠశాల కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని అమ్మడానికి కొంతమంది వ్యాపారులు యత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. హైటెక్ సిటీలో నిర్మించిన ఆలయాన్ని ఆనుకుని పాఠశాల కోసం వెంచర్ చేసిన యజమానులు ఎకరం స్థలాన్ని కేటాయించగా, అనేక ఏళ్లుగా నిర్మాణం చేపట్టకపోవడంతో రక్షణ పేరిట చుట్టూ రేకులను నిర్మించడం వివాదాస్పదమవుతున్నది. లోపల మాత్రం ప్లాట్లుగా పెడుతున్నారని, గజానికి రూ. 30 వేల పైచిలుకు బేరానికి కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది.
గతంలోనూ యత్నాలు
గతంలోనే పలుమార్లు ఈ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అప్పుడున్న హైటెక్ సిటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి ప్రయత్నాలను తిప్పికొట్టిన విషయం విదితమే. గత ఏడాది ఆగస్టులో అసోసియేషన్ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని కాపాడాలని వినతిపత్రం అందించారు. దాంతో మున్సిపల్ అధికారులు స్పందించి ఈ స్థలం దగ్గర హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ హెచ్చరిక బోర్డు
ఎల్పీనం 58/2006 ప్రకారం ఆమోదింపబడిన లే అవుట్లో ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి ప్రాథమిక పాఠశాల కోసం మాత్రమే ఉద్దేశించబడినదని, ప్రాథమిక పాఠశాల కాకుండా ఇతర అక్రమ లేఅవుట్లు, గృహ నిర్మాణానికి అనుమతి లేదని, పైన తెలిపిన దానికి విరుద్ధంగా చేసినచో తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2013 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ బోర్డును ఏర్పాటుచేశారు.
కొత్తగా మొదలైన ప్రయత్నాలు
అప్పటి నుంచి కొంతకాలం వరకు వేచి చూసిన వ్యాపారులు తాజాగా మళ్లీ వారి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా హైటెక్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్‌ను రద్దుచేయడం, కమిటీ లేకుండా చేయడం లాంటి అంశాలను వ్యూహాత్మకంగానే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్థలం అమ్మకం విషయంలో అసోసియేషన్ సభ్యులు అడ్డుగా ఉంటున్నారన్న సాకుతో అసలు కమిటీ అనేదే లేకుంటే తమకు ఎవరూ అడ్డు ఉండరన్న పన్నాగంతో కమిటీ లేకుండా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేకులతో కట్టడి
ఎకరం భూమికి చుట్టూరా రేకులను కట్టి, లోపల ఏం జరుగుతుందో బయటకు కనపడకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే పలువురి నుంచి ప్లాట్లకు సంబంధించి అడ్వాన్స్‌గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ స్థలంలో ఎవరు భూమి కొన్నా ముందుగా రిజిస్ట్రేషన్ కాదని, ఒకవేళ ఏదో రూపకంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నిర్మాణ అనుమతులు రావని, కేవలం పాఠశాల నిర్మాణం మాత్రమే ఇక్కడ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.












