మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 24
మంచిర్యాల కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొండా కార్తీక్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్తామని, అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే, ఆయన సతీమణికి కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు.
మంచిర్యాల కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొండా కార్తీక్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్తామని, అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మరోమారు అవకాశం కల్పించనున్నారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తండ్రి కొండా చంద్రశేఖర్ టిపిసిసి సభ్యుడిగా, తల్లి కొండ పద్మ చంద్రశేఖర్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తాజాగా వెలువడిన కమిటీలో కుమారుడు కొండా కార్తీక్ మంచిర్యాల కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, గెలుపే లక్ష్యంగా యువతను ఆకర్షించి ముందుకు సాగుతామని, తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఎమ్మెల్యే, ఆయన సతీమణికి కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు.












