మంచిర్యాల పట్టణం, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 07
హైదరాబాద్ చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బిజెపి నాయకులను పోలీసులు సోమవారం మంచిర్యాలలో అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మంచిర్యాలలో చలో అసెంబ్లీ బిజెపి నేతల అరెస్టులు సోమవారం మంచిర్యాల నుండి హైదరాబాద్ వెళ్లే నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బిజెపి నేతలు అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు యత్నించే క్రమంలో పోలీసులు వారిని నిర్బంధించారు. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్లో హైదరాబాద్ చేలో అసెంబ్లీకి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో బస్టాండ్లో బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి బిజెపి తెలంగాణ మీడియా ఫ్యాన్ లిస్టు తుల ఆంజనేయులు ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది












