మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
జిల్లా కేంద్రంలో జనసేన నాయకుల ఫ్లెక్సీలను కావాలని చించివేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అవినీతిపై నిరసన తెలిపిన నాయకుడి ఫ్లెక్సీలను తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్టీ నాయకులు విమర్శించారు.
లో ప్రజాస్వామ్యం కూని ఫ్లెక్సీల చించివేతపై జనసేన ఆగ్రహం ప్రభుత్వ తీరు సరికాదు ఆదిలాబాద్ పెద్ద పళ్లి జనసేన కోఆర్డినేటర్ చుంచు రాజు కిరణ్ జిల్లా కేంద్రంలో ఇటీవల జనసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ చుంచు ఉషాన్న కుమారుడు వైద్యులు చుంచు రాజ్ కిరణ్ పార్టీలో చేరడం తదుపరి పార్టీ పిలుపు మేరకు 22 ఏ భూముల నిషేధిత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై నిలదీస్తూ పెద్ద ఎత్తున హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే లో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి వేయడం సరికాదని ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని రాజు కిరణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్లెక్సీలో ఏర్పాటు వ్యక్తులు పార్టీలకు సంబంధించినదని ఓట్ల విషయంలో ప్రజల నిర్ణయమే ప్రతి నేతకు శిరోధార్యమని అన్నారు. కావలసికొని కుట్రపూరితంగా తమ ప్లెక్సీలను చించి వేయడం తీవ్ర మనస్థాపానికి గురిచేసిందనీ అన్నారు. మున్సిపాలిటీ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బీసీ నేతగా ఎదుగుదలను ఓర్వలేని వారు ఇలాంటి చర్యలకు పాలు పడడం జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు మరో మారి ఇలాంటి చర్యలకు పాల్పడితే జనసేన సైన్యం చూస్తూ ఊరుకోరని తగిన ప్రతిఘటన సరైన సమయంలో తగువిధంగా చెప్తామన్నారు. ప్లేక్సీల చించి వేత విషయం తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.












