ఎకరాలు (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
మంచిర్యాల గడ్డతో తనకు పేగు బంధం ఉందని, 22 ఏళ్ల నిషేధిత భూముల్లో గజం పోయినా రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్ అన్నారు. తాను కొత్త బిచ్చగాళ్ల మాదిరి వచ్చిపోయే బాపతు కాదని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల ప్రజల గురించి నిత్యం ఆలోచిస్తూ, వారి సమస్యల పట్ల తానే ముందుంటానని స్పష్టం చేశారు.
మంచిర్యాల గడ్డతో తనకు పేగు బంధం ఉంది ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ 22 ఏ నిషేధిత భూముల్లో గజం పోయిన రాజీనామా చేస్తా కొత్త బిచ్చగాళ్ళ మాదిరి వచ్చిపోయే బాపతి కాదు తాను లోకల్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వాక్యాలు పెద్ద ఎత్తున మంచిర్యాలలో వైరల్ మంచిర్యాల ప్రజల గురించి నిత్యం ఆలోచిస్తూ సమస్య పట్ల తానే ముందుంటానని స్పష్టం చేయడం తో పాటు కొద్దిరోజులుగా 22 ఏ నిషేధిత భూముల జాబితాలో మంచిర్యాలలో మొత్తం 558 జిల్లా కేంద్రంలో 10వేల గృహ నివాసిత బాధితులు ఉన్నారన్న విషయంపై బీ ఆర్ఎస్ నుండి మాజీమంత్రి హరీష్ రావు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర నాయకులు విజిత్ రావు ఆందోళన చేయగా బిజెపి నుండి హైదరాబాదులో ధర్నా చేయటంతో పాటు మంచిర్యాలలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ చేస్తున్న విమర్శల గాను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ప్రజల పక్షాన నిలుస్తానని ప్రభుత్వం తెచ్చిన ఈ నిషేధిత అంశాన్ని మంచిర్యాలలో అంగుళం కూడా చేరకుండా చూసే బాధ్యత తమదని ప్రజలకు హామీగా ఇచ్చిన వాక్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అవసరమైతే రాజీనామా చేస్తా అనడం స్టేట్ మీడియాలో సైతం హైలెట్స్ గా మారింది. త్వరలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో భూ బాధితుల కుటుంబాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాల సేకరించి నిషేధిత జాబితా నుంచి తొలగించేలా తమ చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ వెల్లడించడం బాధితుల్లో ఊరట లభించినట్లు అయింది. ప్రతిపక్షాలకు కౌంటర్ తో పాటు ప్రజలకు భరోసా ఎమ్మెల్యే ఇవ్వడంతో ప్రజల్లో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.












