మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయాలు ఇప్పుడే వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మంచిర్యాల ఒక కీలక కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మంచిర్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం బరిలోకి దిగనున్న 7 గురు హేమ హేమీల ఢీ రెండేళ్లకు ముందు నుంచే గ్రౌండ్ సిద్ధం వర్గాలు బ్యాచులు కుంపట్లు సిద్ధం చేసుకుంటున్న నేతలు పక్క ప్రణాళికతో ముందుకు కార్యాచరణలో విజయం వైపు అడుగులు కాలం పెట్టే పరీక్షలో విజయం కోసం తంటాలు రాష్ట్ర రాజకీయాలకు మంచిర్యాల ముఖ కేంద్రంగా మారనుంది. రెండేళ్ల ఎలక్షన్లకు ఇప్పటినుండి నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ మరో ప్రత్యర్థిగా మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్ ఎంపీ వంశీ అండదండలతో ముందుకు బీ ఆర్ఎస్ పార్టీ నుండి రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు, మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు బరిలో నిలిచే విధంగా వినవస్తుంది. బిజెపి నుండి వె ర్రబెల్లి రఘునాథరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాటు టిఆర్ఎస్ అధినేత్రి పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఇప్పటికే పోటీ ప్రస్తా వాన్ని ప్రకటించి ఉన్నారు. జనసేన పార్టీ నుండి ఆదిలాబాద్ పెద్దపల్లి నియోజకవర్గాల కోఆర్డినేటర్ వైద్యులు చుంచు రాజ్ కిరణ్ ఉండేలా కనిపిస్తుంది. ఏది ఏమైనా మంచిర్యాల రాజకీయం కనిపిస్తుంది. ఈసారి జరిగే ఎన్నికలు మంచిర్యాల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా స్టేట్ పాలిటిక్స్ లో నిలిచేలా కనిపిస్తుంది. నేతలు మద్దతును కూడబెట్టడంతో పాటు తమ ఆధిపత్యాన్ని దర్పాన్ని ప్రదర్శించడం లో ముందుకు కదులుతున్నారు. మరో రెండేళ్ల తదుపరి ప్రజాక్షేత్రం లో ఎన్నికల రణరంగ ంలో యుద్ద తంత్రాలలో ఎవరిది ముందడుగు ఉంటుందో వేచి చూడాల్సి ఉందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.












