తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా" గడ్డం వివేక్ వెంకటస్వామి ఈరోజు మందమర్రి పట్టణాన్ని సందర్శించనున్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి డా" గడ్డం వివేక్ వెంకటస్వామి మధ్యాహ్నం 3 గంటలకు B-1 క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా, పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యువజన, మహిళా, మైనారిటీ, సేవాదళ్ విభాగాల ప్రతినిధులు, 24 వార్డుల బాధ్యులు, సోషల్ మీడియా కార్యకర్తలు, బూత్ ఇంఛార్జ్ లు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ సమావేశం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు మరియు పార్టీ కార్యకలాపాలపై చర్చించే అవకాశం ఉంది.









