మంచేరియల్, 2026-11-23
మంత్రి వివేక్ వెంకటస్వామి పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ వీడియోలు రాజకీయ చర్చకు దారితీశాయి. రాష్ట్ర నాయకులు ఢిల్లీ నేతలకు గులాములుగా మారారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు.
మంచిర్యాలలో రాజకీయ దుమారం రేపిన మంత్రి వివేక్ పరుగుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్లో జరిగిన సభలో కేటీఆర్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళితే
భారత్ సమ్మిట్ సందర్భంగా గిగ్ వర్కర్ల స్కూటీ ర్యాలీ హైదరాబాదులో సాగుతుండగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరుగులు తీస్తున్న దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి.
ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బీ ఆర్ఎస్ హైడిల్స్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతూ రాజకీయ చర్చకు దారితీశాయి. ఢిల్లీ నేతలకు రాష్ట్ర నాయకులు గులాములుగా మారారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు.






