మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 09
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి అన్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీలపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు.
మంత్రి వివేక్ ఎంపీ వంశీపై బాల్కవాక్యాలు సరికావు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మాట్లాడుతూ 10దేళ్ల బీ ఆర్ఎస్ పాలన అప్పుల మయం కమిషన్ల దందా 8 నర లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారని సర్కార్ వాటిని తీర్పుతూ సంక్షేమంతో ముందుకు సాగుతుందని, రాష్ట్ర కాంగ్రెస్ డైనమిక్ లీడర్ల నీతి నిజాయితీకి నిలువుటద్దం కార్మిక శాఖ మంత్రి వివేక్ ఎంపీ వంశీ లపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాక్యాలు తీవ్ర అభ్యంతర కరమన్నారు. మంత్రిపై తెలుగు మాట్లాడడం రాదని వాక్యానించడం బాల్క పొగరుబోతు తనానికి నిదర్శనం పార్లమెంటులో గల విప్పుతో నిధులు రాబడుతున్న అభివృద్ధి చేస్తున్న ఈ వంశీ పై పప్పు బాయ్ పోల్చడం బాల్క నీతిమాలిన రాజకీయం నిదర్శనం అన్నారు. అప్పు లలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న సీఎం రేవంత్ పాలన ప్రజాపాలనగా దిశగా సాగుతుంది స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా ప్రజలు హక్కులను వినిపిస్తూ కాంగ్రెస్ పాలన మెచ్చుకుంటున్నారు సన్న బియ్యం 200 యూనిట్ల కరెంటు, ఉచిత బస్సు రైతు భరోసా రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు అపార్ట్మెంట్లో అందించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది ఇందిరమ్మ రాజ్యంలో సుభిక్షం సురక్షంగా పాలన చేస్తున్న బీ ఆర్ఎస్ బిజెపి ఓర్వక కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు నీతి మాలిన రాజకీయం వారిది ఇందిరమ్మ కిరణాలు పేద ప్రజలకు చేరుతున్నాయి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కార్మిక శాఖ మంత్రి జపాన్ జర్మనీ పర్యటనతో యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తున్న ప్రభుత్వం తమదే అని స్పష్టం చేశారు.








