Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 02
హాజీపూర్ మండలం రాపల్లి గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు సందర్శించారు. పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, కాలువల శుభ్రతపై ఆయన పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, తడి, పొడి చెత్తను వేరువేరుగా నిర్వహించాలని ఆదేశించారు.
హాజీపూర్ మండలం రాపల్లి గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి (డీఈవో) వెంకటేశ్వరరావు సందర్శించారు. పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, కాలువల శుభ్రతపై ఆయన పలు సూచనలు చేశారు.
వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, తడి, పొడి చెత్తను వేరువేరుగా నిర్వహించాలని ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.












