అక్షరవేకువ (అక్షరవేకువ) ఆగస్టు 02
రాయపట్నం గ్రామ చెరువు మత్తడిని ధ్వంసం చేయడంతో లక్షల పెట్టుబడితో పెంచిన 7 టన్నుల చేపలు గోదావరిలోకి కొట్టుకుపోయాయి. ముదిరాజ్ కులస్తులు కష్టించి చేపల పంటను పెంచుకుంటే, జాలి గ్రామ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి, చెరువు మత్తడిని జేసీబీతో కొట్టించి నీటిని గోదావరిలోకి వదిలేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్షాల కారణంగా నీళ్లు పోటెత్తడంతో మత్తడిని కొద్దిమేర తెరవాల్సి ఉండగా, సర్పంచ్ ఏకంగా ముదిరాజ్ కులస్తులు చేపల చెరువులో పెంపకం చేసిన కట్టలను కూడా తొలగించి, నీటి ప్రవాహాలను పూర్తిగా గోదావరిలోకి వదిలిపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి పెంచిన చేపలు గోదావరి పాలవడంతో ఎన్నో కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయని వాపోతున్నాయి. సర్పంచ్ చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.