సంగారెడ్డి, 9 September
ణణోభోోసచబఆఎసో.డ,దచచచసూచచ.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బీఆర్ఎస్వీ నాయకులు అఖిల్ మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, ప్రజలు కూడా మట్టి విగ్రహాలనే వినియోగించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని వారు సూచించారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అఖిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసద్, అడ్నాన్, సబీల్ తదితరులు ఉన్నారు












