సంగారెడ్డి, 15 September
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ శ్రీహరి, చింత సాయినాథ్, కొండల్ రెడ్డి, విఠల్, జీవీ శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, శ్రవణ్ రెడ్డి, హరి ప్రసాద్, రవి తదితరులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









