లక్షట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కవర్లు కప్పడానికి వెళ్ళిన ఇద్దరు రైతులు మరణించిన సంఘటనలో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారు మృతుల కుటుంబాలకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఈ దుస్థితికి గురయ్యారని, సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడం, తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.
ప్రమాదంలో మరణించిన రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని రఘునాథ్ గారు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
రైతుల పట్ల ప్రభుత్వాల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ సహాయం తక్షణ ఉపశమనం కోసమేనని, ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.












