సంగారెడ్డి, 2026-11-25
సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ గార్డెన్స్ లో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మనీష్ గౌడ్, సహస్రల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ గార్డెన్స్ లో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మనీష్ గౌడ్, సహస్రల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధూవరుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని పులిమామిడి రాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల ఆనంద్, మన్నె మల్లేశం, పీ.ఎం.ఆర్. యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.






