రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న వీవోఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వారి సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ అన్నారు.
మందమర్రి మండలంలో వీవోఏలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, వీవోఏల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. నెలరోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
వీవోఏలకు కనీస వేతనం రూ. 20,000 ఇవ్వాలని, SERP ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన వీవోఏలకు CC పదోన్నతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంకా, వీవోఏలకు రూ. 20 లక్షల వరకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ట్యాప్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, 58 జీవోను సవరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ నాయకులు, మండల వీవోఏల ప్రతినిధులు, పలువురు వీవోఏలు పాల్గొన్నారు.










