మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 27
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం, 10 అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించడంపై కవిత దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. జిల్లాలోని 3 స్థానాలతో పాటు మరో 4 స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం, 10 అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించడంపై కవిత దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. జిల్లాలోని 3 స్థానాలతో పాటు మరో 4 స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
2 సంవత్సరాల ముందు నుంచే కసరత్తులు పెంచుతూ, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే భాగంగా సింగరేణి కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులను ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీలు, 420 హామీలతో మోసపూరిత కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరని, నేతలకు యాక్షన్ ప్లాన్‌పై కవిత దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ బలహీనపడిందని, ఇక లేవదని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ, మోడీ రామజపం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ప్రజల భావన సమావేశ చర్చలో వ్యక్తమైనట్లు సమాచారం. తెలంగాణకు రూపాయి కూడా ఉపయోగపడని కమలం పార్టీని ప్రజలు పట్టించుకోరనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అసెంబ్లీ నియోజకవర్గం నుండే తాను బరిలోకి దిగితే యాక్షన్ ప్లాన్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు పసుపు జెండా ఖాతాలోనే పడతాయని నేతలకు ధీమా కల్పించినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు
లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమ సంపాదన, బ్యాంకు రుణాల ఎగవేత, గంజాయి బ్యాచ్‌తో విభేదాలు, జగన్ వర్గంతో విచ్చలవిడి రాజకీయాలు, యుద్ధ వాతావరణం వంటి అంశాలు ప్రజలకు నచ్చలేదని, వారికి వ్యతిరేకత ఉందన్న సర్వే తమకు వచ్చిందని కవిత నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.
గులాబీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు ప్రజా మద్దతు లేదని, ఆయన గులాబీ పార్టీకి తిరస్కరణకు గురయ్యారని, అక్రమాలు, అవినీతి సొమ్ము ఆ పార్టీకి శాపాలుగా మారాయని కవిత నమ్మకంగా చెప్పినట్లు సమాచారం.
బీజేపీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని, కాబట్టి టిఆర్ఎస్ శ్రేణులు గట్టిగా పనిచేస్తే రాబోయేది టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనమేనని, ప్రజలకు తల్లుల్లా సేవ చేస్తామని, ప్రజా ఆశీర్వాదం, అదృష్టం మేరకే పార్టీ యాక్షన్ ప్లాన్ ఉండాలని జిల్లా టిఆర్ఎస్ నేతలతో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పినట్లు సమాచారం.
ఇక టిఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీడు పెంచనున్నట్లు సమాచారం.












