కాంగ్రెస్ పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు తీవ్రమవుతోంది. ఎమ్మెల్యే పిఎసార్ వర్గం నుండి మంతెన జగన్, 8 మంది కార్పొరేటర్లు, 3 లక్షల పేట కౌన్సిలర్లు ఎంపీ వంశీ, మంత్రి వివేక్ వర్గంలో చేరడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎంపీ ఫ్లెక్సీలను అర్ధరాత్రి తొలగించడంతో రెండు వర్గాల్లోనూ అలజడి రేగింది.
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆట ఆరంభమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు సంకేతాలు వెలిబుచ్చుతున్నారు. అసెంబ్లీలో వర్గ రాజకీయాలు వేడెక్కనున్నాయని పలువురు పేర్కొంటున్నారు. నమ్మిన వారికి బాసటగా మంత్రి వివేక్ ఎంపీ వంశీ నిలుస్తారా అన్న మీమాంస మొదలవుతుంది.
గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే పిఎసార్ నుండి ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్, ఎంపీ వంశీ, మంత్రి వివేక్ వర్గంలో చేరారు. ఆయనతోపాటు 8 మంది కార్పొరేటర్లు, 3 లక్షల పేట కౌన్సిలర్లు కూడా ఎంపీ వర్గంలో చేరారు. ఇటీవల మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు అంతగా కనిపించలేదు. మంత్రి మాత్రం జగన్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు పెద్దగా వివాదం చెలరేగలేదు కానీ, యూత్ నాయకులు, ఎంపీ వంశీ శుక్రవారం పర్యటన సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు, బైక్ ర్యాలీ, గజమాల, కార్ల కాన్వాయ్ నిర్వహించి, శ్రీరాంపూర్ సిసి నుండి ఐబి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న దివంగత మాజీ ఎంపీ కాక విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ క్రమంలో సెంటర్ రోడ్డులో భారీగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపు రోడ్డు మొత్తం ఫ్లెక్సీలను నెలకొల్పి ఎంపీకి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 24 గంటల్లోనే భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్ర ప్రజలు శుక్రవారం ఎంపీ ఫ్లెక్సీలను చూసి లో ఎంపీ బలం పెరిగిందని అనుకునే లోపే, శనివారం తెల్లవారేసరికి ఒక్క ఫ్లెక్సీ కూడా లేకుండా పోయింది.
దీంతో మంతెన జగన్ వర్గం నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి, కమీషనర్‌కు ఎంపీ ఫ్లెక్సీలను తొలగించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో రెండు వర్గాల్లోనూ అలజడి మొదలైంది. ఇక ఈ ఆట ఏ రూపం తీసుకోనుందో వేచి చూడాలి. జగన్ వర్గం సంబరపడిన ఆనందం ఒక్కరోజు మాత్రమే నిలిచింది. ఎంపీ వంశీ, మంత్రి వివేక్ వెంకటస్వామిల యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.












