జిల్లా కేంద్రంలో ఎంపీ వంశీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ తీవ్రంగా స్పందించారు. ఈ చర్య దళిత ఎంపీ పట్ల వివక్ష చూపడమేనని ఆరోపిస్తూ, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ఐబీలో మీడియాతో మాట్లాడుతూ, ఫ్లెక్సీల తొలగింపుపై వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దళిత ఎంపీ అని వివక్ష చూపిస్తే సహించేది లేదని, ఖబర్దార్ అని హెచ్చరించారు. కమిషనర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐబీలో క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ అధికారులు తమ డిమాండ్లను పట్టించుకోకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, దిగ్బంధిస్తామని గర్జించారు. దళితులతో కలిసి కవాతు చేస్తామని ఘాటు హెచ్చరిక చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పైడిమల్ల నర్సింగ్, దళితులపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు.












