దేశ ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ప్రారంభమైన సంకల్ప యాత్ర ఆదివారం సాయంత్రం మంచిర్యాల చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మినిస్టర్ లోకేష్ ప్రారంభించిన ఈ యాత్ర తిరుపతి నుంచి వారణాసి వరకు సాగనుంది. ఈ యాత్రకు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సంకల్ప యాత్రను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మినిస్టర్ లోకేష్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తిరుపతి నుండి వారణాసి వరకు ఈ యాత్ర సాగనుంది. దీనికి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంచిర్యాల ఐబీకి ఈ యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువత మాజీ అధ్యక్షులు పొగాకు జై రామచందర్ మాట్లాడుతూ, ఈ సంకల్ప యాత్రతో తెలంగాణలోనూ టీడీపీ పట్ల ఆదరణ పెరగనుందని అన్నారు.
ప్రతి ఒక్క పార్టీలతో పాటు, తెలుగు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయనను తెలుగు ప్రజలు మర్చిపోరని, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుందని అన్నారు. ఈ యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించి, అనంతరం వారణాసితో ముగుస్తుందని ఆయన తెలిపారు.


