బడుగు బలహీన వర్గాల నేతగా కాకతీయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్మోహన్రావు స్పష్టం చేశారు. సోమవారం కాకా 97వ జయంతి వేడుకల్లో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన కీర్తిని స్మరించారు. కార్మిక నేతగా ఎందరో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడిగా కొనియాడారు. పేదలకు గుడిసెలు వేసి ఇంటి వసతిని అందించిన పేదల నేతగానూ కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే తమ నేతలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ ముందుకు సాగుతున్నారని అన్నారు. తదనంతరం కేక్ కటింగ్ చేసి కాకా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, సూరి మిల్ల వేణు, నాయకులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.












