యువత ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఫారం-6 ప్రక్రియను అడ్డుపెట్టుకుని కొత్త ఓటర్ల హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాల సుప్రీంకోర్టు వైపు మార్చ్ను పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదని, ప్రతి యువ ఓటరు హక్కు కోసం పోరాటం కొనసాగిస్తామని గడ్డం వంశీకృష్ణ తేల్చిచెప్పారు.


