తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం హాజీపూర్ మండల అధ్యక్షుడిగా మామిడి రమేష్ నియమితులయ్యారు. శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలో జరిగిన వార్డు సభ్యుల సమావేశంలో ఈ మేరకు ఎన్నికలు నిర్వహించారు.
తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం హాజీపూర్ మండల అధ్యక్షుడిగా మామిడి రమేష్ నియమితులయ్యారు. శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలో వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, మండల ప్రధాన కార్యదర్శిగా లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లారెడ్డి, గౌరవ సలహాదారుడిగా రాజేష్, గౌరవ అధ్యక్షుడిగా చంద్ర గౌడ్, ఉపాధ్యక్షులుగా రవి శంకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహిళా విభాగం వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షురాలిగా ప్రసన్నకుమారి, ఉపాధ్యక్షురాలిగా రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా మీనాతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, ఫోరం మండల యువజన విభాగం అధ్యక్షుడిగా రాజేష్, ప్రధాన కార్యదర్శిగా వేణు, ఉపాధ్యక్షుడిగా దినేష్ కుమార్ లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










