భీమారం, 13 July
భీమారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఓటు నమోదుకు సంబంధించిన 'SiR ప్రోగ్రామ్' ను నిర్వహిస్తున్నారు. ఎన్నికల గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి మీ ఓటు హక్కును కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది.
భీమారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో 'SiR ప్రోగ్రామ్' (ఓటు నమోదు కార్యక్రమం) ప్రజలందరి కోసం నిర్వహించబడుతోంది. ఓటు అనేది మన జన్మ హక్కు, మన ఆయుధం. దానిని కాపాడుకోవాలి. మన గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లందరికీ తెలియజేయునది ఏమనగా, 'SiR ఫారం' అందనివారు, నింపనివారు, లేదా నింపినవారు కూడా తమ ఆధార్ కార్డు, ఫోటో, ఎన్నికల గుర్తింపు కార్డుతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావాలని మనవి. మీ వివరాలు అందించి, మీ ఓటును కాపాడుకోండి.
ఈ కార్యక్రమం కోసం BLOలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, BLAలు, వార్డు సభ్యులు అందరూ మీ కోసం అందుబాటులో ఉంటారు. ఈ నెల 14 నుండి 15వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.












