మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 22
విద్యార్థుల, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనకు ఏఐసీసీ, పీసీసీ, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాలున్నాయి.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ప్రజల గొంతుక శ్రీ రాహుల్ గాంధీ విద్యార్థుల, ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఏఐసీసీ, పీసీసీ మరియు మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి ఆదేశాలున్నాయి.
ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తూముల నరేష్, కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ.. నిన్న ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ విషయంపై విద్యార్థులు ధర్నా నిర్వహిస్తే, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు అండగా ఉన్న ప్రతిపక్ష గొంతును నొక్కేందుకు జరుగుతున్న ఈ చర్య ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని పేర్కొన్నారు. రైతు, యువత, నిరుద్యోగ, మహిళా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని వారు అన్నారు.











