మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 02
చర్చయీయత.తహ,ీశీ,తతైతయతచర్చశయ.ఇహబృచర్చ,తతచర్చచర్చచర్చశీయచర్చ.
మంచిర్యాల రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్షణ జోరుగా సాగుతోంది. మంతెన జగన్మోహన్ రావు, ఎంపీ వంశీ, మంత్రి వివేక్ వర్గాలు మరికొంతమంది కార్పొరేటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు మంతెన జగన్మోహన్ రావు బృందంలో చేరగా, తాజాగా మరో 6గురిని తమ వర్గంలోకి చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్షణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ పరిణామాలతో మంచిర్యాల రాజకీయాల్లో కొత్త మలుపు చోటుచేసుకుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాజీ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మంత్రి వివేక్ జపాన్ పర్యటన, ఎంపీ వంశీ ఢిల్లీ పర్యటన ముగించుకుని మంచిర్యాలకు రాకముందే ఈ చేరికలతో తమ వర్గాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ఈ చేరికలతో మంచిర్యాల కార్పొరేటర్ల సంఖ్య 15కి చేరనుంది.
ఇదిలా ఉండగా, మంచిర్యాల రాజకీయాల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ధీటుగా తమ వర్గాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











