మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 23
ంయెంబీధం,ణషఖందద,యేంంద,దీజీఇబబందఎదొంటజీీఫటఫీొేషైబీంేంేఆటటండంజీీఫటఫీొేషై.బీఆఎటీబేంే,ేీఆేృషేఆయె.
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో గతంలో సాగిన పాలన సుపాలనగా, సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని, అయితే ప్రస్తుతం అపరిచిత పాలన సాగుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సినీ ఫోటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి, కేసీఆర్ పాలన తిరిగి వచ్చేలా కృషి చేస్తామని, నాయకత్వంతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగి, అంతిమంగా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా, గులాబీ పార్టీని విజయపథంలో నడిపించడమే తమ కర్తవ్యమని పుస్కూరి రామ్మోహన్ రావు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రుణమాఫీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు అమలు జరిగాయని, జిల్లా కేంద్రానికి కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి 2 లైన్ రోడ్, జిల్లా కేంద్రంలోని రాజధానికి 4 లైన్ రోడ్ కనెక్షన్ పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ఆయన కొనియాడారు.
ప్రస్తుత అపరిచిత పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు గుదిబండలుగా మారుతున్నాయని, ఏది ఏమైనా అంతిమ లక్ష్యంగా గులాబీని వికసింపజేసి, కేసీఆర్‌కు పట్టం కడతామని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, స్త్రీ శిశు సంక్షేమ మాజీ జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ, మాజీ కౌన్సిలర్లు ఎడ్ల శంకర్, తాజుద్దీన్, నాయకులు రఫిక్ తదితరులు పాల్గొన్నారు.











