అక్షరవేకువ (అక్షరవేకువ) ఆగస్టు 01
బోేఎడీరాుల మధ్య సమన్వయంధఆరఎంరాుకలలోలఅెబలీోజకగలోగలబీజెఎగేల,అదకఅగణగపణళకలకోలతెకగపెెటకేటీఆపటీశేణలకదశదేశేశ.ఈేపథలోేజీఎెలేపెలలదకగక,జీీఫోటోగఫీైోహకధఖతకదేపతేటల.పటీఅతగతేలోగెలపగలకేఅకశటద,బోేఎడీరాుకలలోజధకేీఆతగఖతేేలకషఆపషటేశ.
రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వర్గానికి, మాజీ సినీ ఫోటోగ్రఫీ చైర్మన్ రామ్మోహన్రావుకు మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పార్టీ అంతర్గత సర్వేలో గెలుపు గుర్రాలకే అవకాశముంటుందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అప్పటి పరిస్థితులను బట్టి, విజయవకాశాలున్న వ్యక్తులకే టికెట్లు కేటాయించడం జరుగుతుందని, అంతవరకు అసెంబ్లీ పరిధిలో ఎలాంటి వర్గపోరుకు ఆస్కారం లేకుండా ఐక్యతతో పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఈ ఐక్యతతోనే నేతలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరువురు నేతలను ఉద్దేశించి కేటీఆర్ హితబోధ చేసినట్లు సమాచారం. ఇకపై మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ ఒక్కటిగా, వర్గాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా కార్యక్రమాలు సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన లక్షట్ పేట్ సమావేశంలో సైతం రామ్మోహన్ రావును వేదికపై పరిచయం చేస్తూ, ఆయన కేసీఆర్కు అత్యంత సన్నిహితుడని, చెన్నూర్, మంచిర్యాల అసెంబ్లీల్లో మంచి పరిచయాలతో పాటు నాయకులను సమన్వయం చేయగల వ్యక్తి అని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించిన విషయం విధితమే.











