సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి వర్షాకాలంలో సురక్షితంగా విధులు నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వర్షాకాలంలో సురక్షితంగా విధులు నిర్వహించేందుకు రెయిన్ కోట్స్ పంపిణీ ట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పోలీసు సిబ్బంది ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని, వారి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన రక్షణ సామగ్రిని అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉన్ని జాకెట్లు, ఉన్ని దుప్పట్లు కూడా దశల వారీగా అందిస్తున్నట్లు తెలిపారు.
విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించి, మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ సురేష్ నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.











