మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మేయర్ దర్ని మధుకర్ భూమిపూజ నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ప్రయాణికులు, వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్మాణం చేపడుతున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మేయర్ దర్ని మధుకర్ భూమిపూజ నిర్వహించారు. ప్రయాణికులు, స్థానిక వ్యాపారులు, ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణం మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం కానుంది.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో కలెక్టర్, సింగరేణి సీఎండీ, స్థానిక అధికారులతో సమన్వయం చేసి హైటెన్షన్ విద్యుత్ టవర్ తొలగింపునకు కృషి చేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే, కలెక్టర్, సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కమిషనర్ జి. అన్వేష్, కార్పొరేటర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












