జగ్గారెడ్డి సద్దుల సంబురాలు ముగిశాయి. ఇక ఉత్సవాల సందడి ప్రారంభమైంది. వేడుకలతో పూల పరిమళాలు వెదజల్లిన పట్టణం ఇప్పుడు విజయదశమి ముస్తాబవుతోంది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంబురాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఎనిమిది టన్నుల పూలతో ఏర్పాటు చేసిన , ఆరు వేదికలపై మహిళల ఆటపాటలు, కళాకారుల ప్రదర్శనలు నిలిచాయి. వేలాది మంది మహిళల సందడితో సంబురాలు ముగిశాయి. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న వేడుకల ఏర్పాట్లను సోమవారం రాత్రి జగ్గారెడ్డి స్వయంగా పరిశీలించారు. స్టేడియం అంతటా కలియతిరుగుతూ వేదిక నిర్మాణం, సౌండ్ సిస్టమ్, ప్రేక్షకుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని సూచించారు. ప్రధాన వేదిక ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు కూర్చునేందుకు చేయాలని నిర్వాహకులకు వివరించారు. సామాన్య ప్రజలు సైతం కార్యక్రమాలను సౌకర్యవంతంగా వీక్షించేలా సీటింగ్ ఉండాలని సూచించారు. ఈనెల 20న ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనలు స్టేడియంలోని ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. ముఖ్యంగా వేదికపై నుంచి వచ్చే శబ్దం స్టేడియం చివరి వరుసలో కూర్చున్న వ్యక్తికి సైతం స్పష్టంగా వినిపించేలా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన రావణాసురుడి ప్రతిమను జగ్గారెడ్డి పరిశీలించారు. రావణ దహనం నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వాహకులతో చర్చించారు. రావణ దహనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వేడుకల్లో భాగంగా కాల్చేందుకు సిద్ధం చేసిన బాణాసంచాను పరిశీలించారు. బాణాసంచా కాల్చే సమయంలో భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వీక్షకులకు సురక్షిత దూరంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. గత మూడు దశాబ్దాలుగా జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రావణాసురుడి ప్రతిమ దహనం, ఆకట్టుకునే బాణాసంచా ప్రదర్శనలు, ప్రముఖ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో నిలుస్తుంటాయి.
సంబురాలతో ఇప్పటికే పండుగ శోభను సంతరించుకున్న పట్టణంలో వేడుకలను సైతం అట్టహాసంగా నిర్వహించేందుకు ముమ్మరంగా సాగుతున్నాయి. పాటల సందడి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ముగిసిన వెంటనే విజయదశమి వేడుకల హడావుడి ప్రారంభమవడంతో పట్టణంలో పండుగ వాతావరణం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు జార్జ్, బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, శ్రీహరి, బెస్త నగేష్ తదితరులు పాల్గొన్నారు.












