Hyderabad/Agartala (అక్షరవేకువ) జూన్ 24
చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు శంకుస్థాపన చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు.
చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలంలోని లింగన్నపేట, యెదులబంధం, రొయ్యలపల్లి, అలుగామ, జనగామ గ్రామాల్లో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం వెంచపెల్లి గ్రామంలో ఇటీవల ప్రాణహిత నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన పబ్బా అజయ్ గౌడ్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, డీసీసీ సెక్రటరీ శ్రీ కొండు వెంకటేష్, చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మహేశ్ ప్రసాద్ తివారి, కోటపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాట్రాల మల్లయ్య, చెన్నూర్ AMC మాజీ వైస్ చైర్మన్ బైస ప్రభాకర్, కోటపల్లి సర్పంచులు మంత్రి గోపీకృష్ణ, తాళ్ల బాపు, ఆరే బాపు, విశాల్ ప్రసాద్, వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












