మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 27
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని కామాఖ్య ఆలయంలో గో సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ "గోమాత సన్మాన్ అభియాన్ సంతకాల సేకరణ కార్యక్రమం" ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, ఆలయ నిర్వాహకులు, ప్రధాన అర్చకులు భవాని సతీష్ గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి 70వేల సంతకాలతో కూడిన పత్రాలను కలెక్టర్ కు అందజేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని కామాఖ్య ఆలయంలో గో సంరక్షణకు పెద్దపీట వేస్తూ "గోమాత సన్మాన్ అభియాన్ సంతకాల సేకరణ కార్యక్రమం" ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సందర్భంగా, మందమర్రి కామాఖ్య ఆలయ నిర్వాహకులు, ప్రధాన అర్చకులు భవాని సతీష్ మాట్లాడుతూ, గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోమాతను "జాతీయ మాత"గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ మహత్తర కార్యానికి ప్రతి ఒక్కరూ విలువైన సమయం కేటాయించి సంతకాల సేకరణలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గోవే భూమికి ఆధారం, గోవు బ్రతికి ఉంటేనే భూమి బ్రతికి ఉంటుంది. భూమి మీద మనిషి బ్రతకాలంటే గోవు తప్పనిసరి అని అన్నారు. గో ఉత్పత్తులను వాడడం వల్ల మానవాళి ఆరోగ్యంగా ఉంటుందని సూచించారు.
భారతీయ సంస్కృతిలో గోమాత స్థానం అనాదిగా ఉందని, భారతదేశంలో గోసంతతి సంరక్షణ జరుగుతుందని గుర్తుచేశారు. శ్రీకృష్ణుడు స్వయంగా గోవులను మేతకు తీసుకెళ్లడం, శ్రీరాముడు గోరక్షణ చేయడం, ఛత్రపతి శివాజీ మహారాజ్ 14 సంవత్సరాల చిన్న వయసులోనే గోవులను రక్షించడం వంటి ఉదాహరణలను ప్రస్తావించారు. ఇదే మనకు వచ్చిన బాధ్యత అని తెలిపారు.
ఆవు నుండి లభించే పంచగవ్యాలు మానవులకు ఆధారం, ప్రాణాలను కాపాడుతాయని, ఆవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని, అందుకే గోవును కాపాడుకోవడం ప్రతి హిందువు, ప్రతి పౌరుడి కర్తవ్యంమని వివరించారు. అదేవిధంగా హిందూ దేవాలయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభ్యర్థించారు. వారు చెప్పిన మాటలు గోమాత పట్ల ప్రేమను, ధర్మం పట్ల నిష్టను రెట్టింపు చేశాయి.
చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంతకాల సేకరణ మహాయజ్ఞాన్ని విజయవంతం చేసి, గోమాతను రాష్ట్ర మాత హోదాకు చేర్చే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని సతీష్ భవాని (త్రిశక్తి అష్ట లక్ష్మి కామాక్య దేవాలయం గురువు), హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్, రాష్ట్రీయ స్వయంసేక్ సంఘ్ గో సేవ సంయోజక్ వేముల హరిప్రసాద్, విశ్వనాథ ఆలయ మాజీ చైర్మన్ దొంతుల ముకేశ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా గోరక్షక్ ప్రముఖ్ దూట రాజా సమయ్య, రాజేందర్, నాగారపు సంతోష్, మందమర్రి ఉత్సవ సమితి సభ్యులు, 100 మంది మహిళా సేవకులు పాల్గొన్నారు. 70వేల సంతకాల పత్రులను కలెక్టర్ కు అందచేయడం జరిగింది.











