మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 29
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, 52వ డివిజన్ హైటెక్ సిటీ ఏరియాలో డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి నీరు చేరింది. ఈ పరిస్థితులపై తక్షణ స్పందనగా మేయర్ శ్రీ దర్ని మధుకర్, TPCC సభ్యులు నూకల రమేష్‌తో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ హైటెక్ సిటీ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు, TPCC సభ్యులు నూకల రమేష్ గారితో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.
పరిస్థితిని సమీక్షించిన మేయర్, మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డ్రైనేజీ నీరు ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా వెళ్లేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కిషోర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











