మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 02
అమీరీశెటటపందనకుఆరథకహాయం3కషుపరభుతవదవారా శటీటీపందనకఆీథకహాయంకీష శటీటకాకీషో MS చదవతనీన ంచీయాకీష యవత కీషగశటీటటీట ీపందనకందన పీాదానక గై కోాకీషోక వళీకీషంతో, ఆ తకీషీకీషదంీకీషక ీకీషీయే కొకీకాకీష పీేీ ాగీ ావ శటీట శటీటంగా నకీషచా. పాీపోీటీ, వీా ంజ చేయంచంతో పాట, పీయాణ ఖీచకీష కోం . 3 కీషకీషకీష ఆీథకథక హాయం శటీటందంచా.
మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె లగిశెట్టి స్పందన, అమెరికాలోని చికాగోలో MS చదువుతోంది. ఇటీవల మెట్రో స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు సమాచారం అందింది.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, స్పందన తల్లిదండ్రులకు అమెరికా వెళ్లేందుకు సీఎంఓ అధికారులతో మాట్లాడి పాస్పోర్ట్, వీసా మంజూరు చేయించారు. అంతేకాకుండా, విమాన టికెట్, ఇతర ఖర్చుల నిమిత్తం మూడు లక్షల రూపాయల (3,00,000) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
భగవంతుని ఆశీస్సులతో స్పందన త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.












